విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజా బాట

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; విద్యుత్ సమస్యల పరిష్కారానికి మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకే విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని భూర్నూర్ (బి) పంచాయతీలో ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో తిరిగి విద్యుత్ సమస్యలు తెలుసుకున్నారు. విద్యుత్ స్తంభాలు సరిగా ఉన్నాయా లేదా విద్యుత్ సరఫరా విషయంపై ప్రజలతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా విద్యుత్ సరఫరా విషయంపై మాట్లాడారు. తెల్ల రేషన్ కార్డు ప్రతి అర్హులైన విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుందని సర్పంచ్ పేందూర్ గణపత్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణపత్ రావు తో పాటు విద్యుత్ శాఖ ఎల్ఐ గేడం లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, వార్డు సభ్యులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.
