ప్రజా సమస్యలకు పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యలకు పరిష్కారమే లక్ష్యం
మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’
విజయవాడ, ఆంధ్రప్రభ : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ భవన, నిర్మాణ కార్మికుల సంక్షేమ సలహా మండలి చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. భూమి, సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలు తదితర అంశాలపై పలువురు వినతిపత్రాలు సమర్పించారు.
ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న నాయకులు సంబంధిత అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపే వేదికగా ప్రజా వేదిక కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని వారు పేర్కొన్నారు.






