విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

పరకాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ అన్నారు. శుక్రవారం రోజు ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ స్కూల్లో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతమైన భోజనం అందించాలని, అదేవిధంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ నాయకులు మహేష్, సందీప్, వినయ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply