Protested | ఉపాధి పథకం పేరు మార్పుపై నిరసన

Protested | ఎడపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జమ్లం గ్రామంలో గురువారం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరును మార్చడానికి వ్యతిరేకిస్తూ అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పేదలకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో 2005లో ప్రారంభమైన ఉపాధి హామీ పథకం పేరు మార్చి గతంలో కేంద్రం 90% నిధులు కేటాయిస్తుండగా నూతన చట్టం ద్వారా కేంద్రం 60, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించాలన్నది సరికాదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం కేంద్రం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్, బోధన్ డివిజన్ నాయకులు శ్రీపతి మల్లేష్ సుల్తాన్ సాయిలు, గణేష్ పాల్గొన్నారు.
