రోడ్డెక్కి రైతుల ఆందోళన!!

న‌ల్ల‌గొండ, ఆంధ్ర‌ప్ర‌భ : నల్లగొండ జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళ‌న‌కు దిగుతున్నారు. ఈ రోజు ప‌లు గ్రామాల్లో రైతులు(Farmers) రోడ్డెక్కి ఆందోళ‌న చేశారు. మాడుగుల పల్లి మండల రైతులు వందలాది మంది నల్లగొండ-మిర్యాలగూడ(Nalgonda-Miriyalaguda) ప్రధాన రహదారిపై ధ‌ర్నా చేప‌ట్టారు. తిపర్తి మండలంలో కొంతమందికి మాత్రమే యూరియ బస్తాలు లభించాయి.

నిడమానురు(Nidumanuru) మండల రైతులు కోదాడ – జడ్చర్ల(Kodad – Jadcharla) ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దేవరకొండ, కొండమల్లేపల్లి పట్టణాల్లో యూరియ కోసం రైతులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. యూరియా స్టాకు లేదన్న కారణంతో వ్యవసాయ శాఖ అధికారులు రెండు రోజుల తర్వాత యూరియా బస్తాలను ఇస్తామని చిట్టీలు రాసి ఇచ్చారు. లారీ(Lorry)లో వచ్చే బస్తాలకు మాత్రమే అధికారులు చిట్టీలు ఇవ్వడంతో తమ వంతు రావాడానికి ఎన్ని రోజులు పడుతుందో అని రైతులు ఆందోళనకు దిగారు.

Leave a Reply