పెల్లుబిక్కిన పాడిరైతుల నిరసన
యాదాద్రి ప్రతినిధి, ఆంధ్రప్రభ : యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహాస్వామి ఆలయం(i Lakshmi Narasimhaswamy Temple), చెరువుగట్టు, వేములకొండ, కీసర తదితరల దేవాలయాలకు సుమారు 40 ఏళ్లుగా సరఫరా(40 years of service) చేస్తున్నమదర్ డెయిరీ నెయ్యి నిలిపి వేయడం సిగ్గు చేటని, ఇందుకు నిరసనగా బీఆర్ఎస్(BRS) ఆధ్వర్యంలో పాడి రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. నెయ్యి సరఫరాను(Ghee for 40 Years) పునరుద్ధరించాలని ఈ రోజు యాదాద్రి భువనగిరి(Bhubaneswar) జిల్లా యాదగిరి గుట్టలో పాడి రైతులు దీక్ష చేశారు.
ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య(Karre Venkataiah), పాక్స్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, నార్మూల్ డైరక్టర్లు మోతె సోమి రెడ్డి, మాజీ డైరెక్టర్లు ఒగ్గు బిక్షపతి(Oggu Bikshapati), సందిల భాస్కర్ గౌడ్, మారెడ్డి కొండల్ రెడ్డి, సట్టు తిరుమలేష్, గుంటి మధుసూదన్ రెడ్డి, గడ్డమీది రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల డిమాండ్ :
- రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తరువాతనే నార్మూల్ సంస్థ ఎన్నికలు నిర్వహించాలి
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్లకు(ovt Hostels for 40 years) సరఫరా చేస్తున్న12 వేల లీటర్ల పాలను నిలిపివేశారని, వాటిని వెంటనే పునురుద్ధరించాలి.
- మదర్, విజయ పాల పదార్థాలను వెంటనే పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయాలి.
- ప్రభుత్వం నుండి రూ. 30 కోట్ల రూపాయల గ్రాంట్ ను, పెండింగ్ లో ఉన్న రూ. నాలుగు ప్రోత్సాహం బిల్లును ఇప్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkatareddy), ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.
- నార్ముల్ మదర్ డెయిరీ 40 వేల మంది పాడి రైతులతో కూడుకున్న సంస్థ అని, మదర్ డెయిరీ రైతు సంస్థ కాబట్టి దీనిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలి.

