Protest – హైదరాబాద్ లో ఆశా వర్కర్ల ఆందోళన – కోఠిలో టెన్ష‌న్

ఆరోగ్య శాఖ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం..
లోప‌లికి వెళ్లేందుకు య‌త్నం… ఉద్రిక్త‌త
అడ్డుకున్న పోలీసులు.. పలువురు అరెస్ట్
నిరసనకారుల్ని త‌ర‌మివేసిన పోలీసులు..

హైద‌రాబాద్ – తమ సమస్యలను పరిష్కరించాల‌ని కోరుతూ నేడు ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్ట‌డికి వారు య‌త్నించారు.. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.. దీంతో పెద్ద సంఖ్య‌లో ఆశా వర్కర్లు బైఠాయించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు..పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ప‌లువురిని అరెస్ట్ చేసి స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.. అలాగే అక్క‌డ నిర‌స‌న చేస్తున్న‌వారిని త‌రిమివేశారు..ఇక ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయానికి వ‌స్తున్న ఆశా వ‌ర్క‌ర్ల‌ను ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఈ నేప‌ధ్యంలో పోలీసుల‌కు, ఆశావ‌ర్క‌ర్లకు మ‌ధ్య తోపులాట జ‌రిగింది..ఈ గందరగోళ పరిస్థితితో సొమ్మసిల్లి పడిపోయారు. వారిని వెంట‌నే స‌మీపంలోని హాస్పిట‌ల్స్ కు చికిత్స కోసం త‌ర‌లించారు. కాగా, ఆశా వర్కర్ల అరెస్టులను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది.

వేతన పెంపు కోసం ..

అయితే, ప్రస్తుతం ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం తక్కువ వేతనాన్ని ఇస్తుంది. దీంతో తమకు వేతనాన్ని కనీసం రూ.18,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినందుకు ఆర్థిక భరోసా కింద రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. ఇక, మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు రూ.50 వేల సహాయం, విధుల్లో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు మట్టి ఖర్చుల కోసం రూ.50 అందించాలని పేర్కొంటున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఈఎస్ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలంటూ ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు ఆశా వర్కర్లు.

Leave a Reply