మానికొండలో రైతన్న మీ కోసం కార్యక్రమం…

మానికొండలో రైతన్న మీ కోసం కార్యక్రమం…

రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
ఎమ్మెల్యే యార్లగడ్డ

ఉంగుటూరు, ఆంధ్రప్రభ : ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీ కోసం” వారోత్సవాల కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణ జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి వెంకట గుర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో రైతుల వద్దకు వెళ్లి కరపత్రాలు అందజేసి, వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచే పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు ప్రారంభించినట్లు గురుమూర్తి తెలిపారు.

రైతులకు ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత ఎప్పుడూ లేని విధంగా మానికొండ గ్రామం భారీ మెజారిటీ ఇచ్చిందని, అందుకే ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. మానికొండ–తరిగొప్పల రోడ్డుతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి మొత్తం రూ.3.45 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. ఇందులో రూ.2.50 కోట్లతో అధ్వానంగా ఉన్న రహదారిని 10 రోజుల్లో ప్రారంభిస్తామనీ, మరో రూ.95 లక్షలతో నందమూరు రోడ్డును నిర్మిస్తామని స్పష్టం చేశారు.

ఇప్పటికే నియోజకవర్గంలో 60 వేల మందికి ఇంటి వద్దే రక్త పరీక్షలు నిర్వహించామని, రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలలో లోపాలను సరిచేసి, రాష్ట్ర రాజముద్రతోనే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, ఉంగుటూరు మండల అధ్యక్షులు కొలుసు రవీంద్ర, రాష్ట్ర టిడిపి నాయకులు చిరుమామిళ్ల సూర్యం, దొంతు చిన్నా, మానికొండ గ్రామ టిడిపి అధ్యక్షులు యడ్లపల్లి సాయిబాబు, మానికొండ పిఏసిఎస్ చైర్మన్ అరికట్ల రవి, కుందేటి చంద్రశేఖర్, గొడ్డళ్ల చిన్న రామారావు, బెజవాడ నాగేశ్వరరావు, చింత వాసుబాబు, కొండేటి వెంకటేశ్వరరావు, అరుమళ్ళ కృష్ణారెడ్డి, మేడేపల్లి రమ, తుమ్మల లత, దాసరి రవళి, కొసరాజు సాయి, షేక్ ఫిరోజ్, షేక్ అజీజ్, విష్ణు, పొట్లూరి భువనేశ్వరి, రాజబోయిన శివాజీ, యర్రగుంట్ల వినోద్, కొమ్మారెడ్డి రాజేష్, బోడపాటి రవి, తిరువీధి నరేష్, వేలమర్తి రాజు, లంకా సత్తిరాజు, గుడ్డేటి అనిల్, ఉయ్యూరు మురళి, తోటా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply