Program | బాధ్యతతో పనిచేస్తేనే ప్రజల్లో గుర్తింపు
- తహశీల్దార్ కొత్తపల్లి పరుశురాం
Program | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతతో పనిచేస్తేనే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని నల్లగొండ తహశీల్దార్ కొత్తపల్లి పరుశురాం అన్నారు. ఇవాళ మండలంలోని బుద్ధారం గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని ప్రమాణం చేపించారు. అనంతరం సర్పంచ్ తుక్కాని వెంకట్ రెడ్డిని, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు.
ఈసందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ… నూతన పాలకవర్గం ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని, ముఖ్యంగా మౌళిక వసతుల కల్పనలో ముందుండాలని, ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాదయ్య, కార్యదర్శి రేణుక, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

