నిర్మాతలు ఏపీకి.. ‘ఫెడ్’ నేతలు తెలంగాణలో భేటీలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : సినీ కార్మికుల ఆందోళనలు కొనసాగుతోంది. తమ జీతాలు పెంచాలంటూ తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులు పంచాయితీ తెగ‌లేదు. ఈ విషయంలో నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరాలేదు. సినీ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ టాలీవుడ్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తీరు ఆసక్తిగా మారింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కుందుల దుర్గేశ్‌తో (Kandula Durgesh) తెలుగు సినిమా నిర్మాతలు కొందరు భేటీ కాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy) తో ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) భేటీ అయ్యారు. ప్రొడ్యూసర్లు ఏపీ మంత్రి వద్దకు, కార్మికులు తెలంగాణ మంత్రితో భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

ఏపీలో భేటీ..
తెలుగు ఫిల్మ్​చాంబర్​ అసోసియేషన్​సభ్యులు ఈ రోజు ఏపీ రాజధానికి అమరావతికి వచ్చారు. ఆ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్‌తో భేటీ అయ్యారు. సినీ ప్రముఖులు నాగవంశీ, బన్నీ వాసు, పలువురు సినీ ప్రముఖులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఏపీ సచివాలయానికి సినీ ప్రముఖులు బయలుదేరి వెళ్లి మంత్రితో సమావేశమయ్యారు. అయితే నిర్మాతలు విజవాడకు ఎందుకు వెళ్లారనే విషయం తెలియదని ఫిల్మ్​ఫెడరేషన్​అధ్యక్షుడు వల్లభనేని అనిల్​ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా ఉందన్నారు. ఇక్కడ చర్చలు జరపకుండా విజయవాడకు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డిని కలిసి తమ సమస్యలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. మంత్రి సూచనల మేరకు నిర్ణయం తీసుకుని ముందుకెళ్తామన్నారు. కాసేపటి క్రితం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో మంత్రి కోమటిరెడ్డితో ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారరు. టాలీవుడ్‌లోని తాజా పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Leave a Reply