problems | ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా

problems | ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా
problems | ధర్మపురి, ఆంధ్రప్రభ : జైన గ్రామ ప్రజలు ఒక్కసారి ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని సర్పంచ్ అభ్యర్థి టకుమెట్ల విజయ ప్రభాకర్ తెలిపారు. ఈ రోజు గ్రామంలోని వివిధ కూడళ్లలో, వాడవాడలా, ఇంటింటా తిరుగుతూ ఒక్కసారి అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు.
లేడి బ్యాగ్(Lady bag) గుర్తుకు ఓటు వేసి భారి మెజారిటీతో గెలిపించాలని గ్రామంలోని సమస్యల(problems)ను పరిష్కరిస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు బ్రహ్మరథం పడుతూ గెలిపించేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు.
