Problems | జంగంపల్లి అభివృద్ధి నా లక్ష్యం..

Problems | జంగంపల్లి అభివృద్ధి నా లక్ష్యం..

Problems | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామ అభివృద్ధే త‌న లక్ష్యమ‌ని కాంగ్రెస్ అభ్యర్థి పద్మ న‌ర్సింహులు యాదవ్ అన్నారు. గ్రామంలో ఆమె ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మీ ఇంటి ఆడబిడ్డగా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి త‌న‌ను గెలిపించాలని కోరారు. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య, మురికి కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి చొర‌వ చూపుతాన‌ని తెలిపారు. అలాగే కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేస్తాన‌న్నారు. త‌న‌పై నమ్మకం ఉంచి సర్పంచిగా గెలిపించాలని కోరారు. గ్రామంలో ఆమె నిర్వహిస్తున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది. మహిళా సంఘాలు కుల సంఘాలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నాయి.

Leave a Reply