గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం

  • సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల మేనిఫెస్టో విడుదల
  • వినూత్నంగా ప్రచారం
  • హామీలను బాండ్ పేపర్లపై అందజేత

ఖానాపూర్ రూరల్‌, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాభివృద్ధే లక్ష్యంగా భీర్నంది సర్పంచ్ అభ్యర్థి తమ ఎన్నికల మేనిఫెస్టోను గ్రామంలో ఘనంగా విడుదల చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా తమ కార్యాచరణ ప్రణాళికను గ్రామస్థుల ముందుంచారు.

ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ… రాబోయే ఐదేళ్లలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను బాండ్ పేపర్లపై రాసి గ్రామ ప్రజలకు అందజేశామని తెలిపారు. గ్రామంలో దేవాలయ నిర్మాణానికి రెండు గుంటల భూమి కేటాయింపు, గ్రామంలోని ఆడపిల్లల వివాహాలకు రూ.5,000 ఆర్థిక సహాయం, పేద కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు రూ.5,000 సహాయం అందించడం, ప్రతి వాడలో సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థుల కోసం ఆధునిక లైబ్రరీ ఏర్పాటు వంటి పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలిపారు.

అలాగే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చుతానని అభ్యర్థి ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply