ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దిల్లీలోని చారిత్రక ఎర్రకోట (Red Fort)పై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు, ప్రధాని త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించి, రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ వరుసగా 12వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల సందర్భంగా ‘నయా భారత్’ అనే ఇతివృత్తం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జాతీయ వేడుకల భద్రత కోసం ఎర్రకోట చుట్టూ 11 వేల మంది భద్రతా సిబ్బంది, 3 వేల మంది ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. అలాగే, రెండు ఎంఐ 17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపించి వేడుకకు మరింత శోభను తీసుకొచ్చాయి. ఈ వేడుకలు దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని, ఐక్యతను గుర్తు చేశాయి.
జాతీయ జెండాను ఆవిష్కరించిన పీఎం మోదీ
