ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం బయోపిక్‌ల పర్వం నడుస్తోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా భారత ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Narendra Modi) లైఫ్ జర్నీని తెలియజేస్తూ బయోపిక్ (biopic) రాబోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ వెండితెరపైకి రానుంది. ఆయన జన్మదినం సందర్భంగా మూవీ (movie)ని ప్రకటించారు. క్రాంతి కుమార్ (Kranti Kumar) దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ‘మా వందేస (‘Maa Vande) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ మలయాళ హీరో ఉన్ని ముకుందన్ (Malayalam hero Unni Mukundan) మోదీ పాత్రలో కనిపించనున్నారు. ‘ఎన్నో పోరాటాల కన్నా, తల్లి సంకల్పం గొప్పది’ అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు.
సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ (Silver Cast Creations) ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమాను పూర్తిగా యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. బాల్యం నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన తీరును ఇందులో చూపించనున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి ఆయన తల్లి హీరా బెన్(Modi’s mother Hira Ben)తో ఉన్న అనుబంధాన్ని హైలైట్ చేయనున్నారు.

