Press Meet |ఏఐ సాంకేతికతలో ముందు వరుసలో భారత్ : చంద్రబాబు
ఢిల్లీ, : ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారని తెలిపారు. పవర్, ఇన్సూరెన్స్, మైనింగ్ సహా పలు రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని. పలు రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఏపీలోనే తొలిసారి విద్యుత్ రంగం సంస్కరణలు తీసువచ్చామని పేర్కొన్నారు
నేడు ఢిల్లీ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ ,వెంటిలేటర్‌పై ఉన్న రాష్టానికి ఆక్సిజన్ ఇచ్చారని.. రాష్ట్ర అభివృద్ధికి ఇంకా కష్టపడాలని అన్నారు. గత పాలనతో రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో రాష్టానికి కొంత ప్రయారిటి ఇచ్చారన్నారు. బడ్జెట్‌లో ఏం ఇచ్చారని కొందరు అంటున్నారపి…. మన పేరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 16 వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చర్చిస్తానని.. లోటు బడ్జెట్ ఉందని పేర్కొన్నారు
భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఏఐ సాంకేతికతలో భారత్ ముందు వరుసలో ఉందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమోగుతోందని తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీకి గ్లోబల్ హబ్‌గా భారత్ మారబోతోందని వెల్లడించారు. ఎమ్ఎస్‌ఎమ్‌ఈ పాలసీకి గేమ్‌ఛేంజర్‌గా భారత్ మారనుందని పేర్కొన్నారు. భారత్‌లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు.
.
బీజేపీ, ఎన్డీఏకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పడానికి ఢిల్లీ వచ్చానని అన్నారు. ఢిల్లీ చూసినప్పుడు అందరిలో ఒక అభిప్రాయం వస్తుందని.. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం, రాజకీయం కాలుష్యం ఆరోగ్యానికి హానికరమన్నారు. ఢిల్లీలో కలుషితమైన నీరు ఉందని.. యమున కలుషితం అయిపోయిందన్నారు. వికసిత భారత్ రియాలిటీ అని చెప్పుకొచ్చారు. దావోస్‌లో అందరూ ఇండియా గురించి మాట్లాడుతున్నారన్నారు.
.
నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ నుంచి ఏపీ సచివాలయానికి చంద్రబాబు రానున్నారు. ఆర్టీజీతో పాటు ప్రభుత్వ పథకాల, కార్యక్రమాల అమలుపై ఫీడ్ బ్యాక్‌పై సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు సచివాలయం నుంచి ఉండవల్లి నివాసానికి వెళతారు సీఎం చంద్రబాబు.AP News: ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహంబంగారం ధరలు షాక్ కొట్టిస్తున్నాయి..