Press conference | కూటమి పై స్పష్టమైన వ్యతిరేకత..
- ప్రజా భాగస్వామ్యంతో అభిప్రాయ సేకరణ..
- కోటి సంతకాలతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన ప్రజలు..
- ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించేలా అభిప్రాయాలు..
- ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకోవాలి..
Press conference | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రం ప్రజలందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారన్న విషయం కోటి సంతకాల ద్వారా స్పష్టమైందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్(Devineni Avinash) పేర్కొన్నారు. ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున కోటి సంతకాలను సేకరించామన్న ఆయన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు స్పష్టమైన వ్యతిరేకతను అభిప్రాయాల్లో తెలిపారు అన్నారు. విజయవాడలోని గుణదలలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ నుండి మెడికల్ కాలేజ్ ల ప్రైవేటికరణకి వ్యతిరేకంగా కోటి సంతకాలు చేస్తున్నామని, తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో సంతకాలు చేపాట్టామని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 96 వేల సంతకాలు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ(Privatization)కు వ్యతిరేకంగా చేశారని, కూటమి ప్రభుత్వం పై ప్రజలు తమ వ్యతిరేకతని తెలియజేసారని చెప్పారు. కూటమి ప్రభుత్వ విధానాలను ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేశామని, కూటమి నేతలు(kutami nethalu) బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ప్రజలు కోరుకొంటున్న విధంగా పరిపాలన చేయాలని హితవు పలికారు. ఎన్టీఆర్ జిలాల్లో ప్రతి నియోజకవర్గంలో 60వేల పైనే సంతకాలు చేశారని, 18 నెలల్లో ప్రజలుకి ఉపయోగపడే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమం ఒకటి కూడా చేయలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి పనులు సాగాయని, 8వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు పడలేదన్నారు.
మా పాలనలో ఒక్క రోజు లేట్ అయితే నానా రభస చేసే వాళ్ళు.. ఇప్పుడు మీడియాకి కనపడడం లేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పథకాల(schemes)కు పేర్లు మార్చిన సక్రమంగా అమలు చేయడం లేదని, అప్పులు తీసుకొని వచ్చిన డబ్బులు ఏమైపోతున్నాయే తెలియడం లేదన్నారు. సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు అన్నారు. నియోజక వర్గాల నుండి జిల్లా పార్టీ కార్యాలయం వద్దకి సేకరించిన సంతకాలు వస్తాయని, 15వ తేదీ జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్దకి సంతకాలు(signatures) పంపుతామని.. 17వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సంతకాలు గవర్నర్ కి అందజేస్తామని ప్రకటించారు. పీపీపీకి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం(fight) కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఇతర కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు ఉన్నారు.

