presentation | జాతీయస్థాయి మహోత్సవంలో పద్మశ్రీ కనకరాజు బృందం ప్రదర్శన

presentation | ఉట్నూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24వ తేదీన విశాఖపట్నంలో జరిగిన జాతీయస్థాయి పెసా జాతీయస్థాయి మహోత్సవ వేడుకల్లో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మార్లవాయి చెందిన పద్మశ్రీ కనకరాజు గుస్సాడి బృందం ఉత్సవాలలో పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారని అధికారులు శుక్రవారం తెలిపారు. గుస్సాడి బృందంతో పాటు పెసా అదిలాబాద్, అసిఫాబాద్ జిల్లా కోఆర్డినేటర్లు, ఉట్నూర్ పీఎంఆర్సి కోఆర్డినేటర్స్, ఇప్పపువ్వు లడ్డు తయారు నిర్వాహకులు ఇప్పపువ్వు, ఇతర ప్రదర్శనలు చేశారని తెలిపారు. కళాబృందాలను పెస కోఆర్డినేటర్ వర్గ వసంతరావు ఆధ్వర్యంలో 16 మంది గుస్సాడి కళాబృందాలు ఈ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ శిక్షణ అధికారి సుభాష్ చంద్ర గౌడ్ ఆధ్వర్యంలో గుసాడికల బృందాలు ప్రదర్శనలు నిర్వహించారని తెలిపారు.

presentation

Leave a Reply