Prepare | ఎన్నిక‌ల సామాగ్రి పంపిణీ

Prepare | ఎన్నిక‌ల సామాగ్రి పంపిణీ

ఎన్నికల సామాగ్రి పరిశీలించుకుంటున్న రైటర్నింగ్ అధికారులు

Prepare | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. సామాగ్రిని తీసుకున్న ఎన్నికల సిబ్బంది వాటిని లెక్క పెట్టుకొని సిద్ధం చేసుకుంటున్నారు. డివిజన్ లోని 11మండలాలలో 155గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 546 మంది రిటర్నింగ్ అధికారులు, 1060 సహాయక రిటర్నింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు డి ఎల్ పి ఓ నాగరాజు తెలిపారు. 4091 మంది సిబ్బంది ఎన్నికల (Election) విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి పీడీ కార్యాలయ ఏఓ మధుకర్, తహసీల్దార్ విట్టల్, ఎంపీడీవో విజయ్ కుమార్ లు మండల విద్యాశాఖ అధికారి నాగయ్య లు రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.

Leave a Reply