గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి

గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి

  • ఐసీడీఎస్ సూపర్ వైజర్ వెంకటలక్ష్మి

దండేపల్లి, ఆంధ్రప్రభ : గర్భిణీ మహిళలు బాలింతలు సరైన పౌష్టిక ఆహా రం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్ వైజర్ వెంకటలక్ష్మి, కన్నెపల్లి గ్రామసర్పంచ్ చుంచు నగేష్ గర్భిణీ స్త్రీలకు ,బాలింతలకు సూచించారు. మండలంలోని కన్నెపల్లి అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక గ్రామ సర్పంచ్ చుంచు నగేష్, ఐసిడిఎస్ సూపర్ వైజార్ వెంకటలక్ష్మి, ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు అక్షరాబ్యాసం తోపాటు, అన్న ప్రసన్న, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రభుత్వ పౌష్టికాహారం సరుకులు మధ్యాహ్న భోజనం ఆటపాటల ద్వారా విద్యా బోధన అందిస్తారన్నారు గర్భిణీ మహిళలు ప్రతి రోజు ఆకుకూరల తోపాటు,కూరగాయలు, పండ్లు, వంటి సరైన పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు.అనంతరం తల్లిదండ్రులకు శిశు పోషణ పై అవగాహన కల్పించారు,ఈ కార్యక్రమంలో,ఉపసర్పంచ్ ముత్తు శంకరయ్య, వార్డు సభ్యులు, ఏ ఎన్ ఎం విజయ లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, స్వరూప, సంధ్య, ఆయాలు ఆశ కార్యకర్తలు,గర్భిణీ మహిళలు,బాలింతలుచిన్న పిల్లతల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply