Prathipati Pullarao | చిన్నారికి పోలియో చుక్కలు..

Prathipati Pullarao | చిన్నారికి పోలియో చుక్కలు..
- ప్రజల ఆరోగ్య రక్షణే కూటమిప్రభుత్వ తొలి ప్రాధాన్యత
- ముఖ్యమంత్రి చూపిన మార్గంలో ప్రత్తిపాటి ఫౌండేషన్ ప్రజల అనారోగ్య సమసల్ని నయం చేస్తోంది : ప్రత్తిపాటి
- పేదలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలు కాకూడదన్నదే ప్రత్తిపాటి ఫౌండేషన్ లక్ష్యం
- రెండు చుక్కలతో జీవితాంతం రక్షణ లభిస్తుందనే నిజాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి
- 40వ ఉచిత మెగా కంటి-గుండె వైద్య శిబిరాన్ని, పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీమంత్రి ప్రత్తిపాటి
Prathipati Pullarao | చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : ప్రజల కనీస అవసరాలు తీర్చడం, ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతని, పేదలు ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలై బాధపడకూడదన్న సదుద్దేశంతోనే ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రెండు చుక్కలతో జీవితాలను కాపాడుకోవచ్చనే వాస్తవాన్ని చిన్నారుల తల్లిదండ్రులు గ్రహించాలని, పల్స్ పోలియో ఆవశ్యకతను గుర్తించాలని పత్తిపాటి కోరారు.ఆదివారం పురుషోత్తమపట్నంలో ప్రత్
