Prashanth Reddy | రెండు లక్షల ఎల్ఓసి అందజేత‌

Prashanth Reddy | రెండు లక్షల ఎల్ఓసి అందజేత‌

Prashanth Reddy | (మోర్తాడ్ )భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన గజ్జెల గౌరీ హుద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్ లో ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం చేరగా, స్థానిక నాయకుల చొరవతో మాజీ మంత్రి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, చికిత్స నిమిత్తం రూ.2,00,000 ల ఎల్ఓసిని మంజూరు చేయించి ఇవాళ‌ హైదరాబాద్ లోని తన నివాసంలో బాధితుని కుటుంబ సభ్యులకు ఎల్ఓసి కాపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా బీద వారమైన త‌మ‌కు చికిత్స కోసం ఎల్ఓసి మంజూరుకు కృషిచేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply