Praja Darbar | సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..
- ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
Praja Darbar | పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని శాసన సభ్యులు వర్ల కుమార్ రాజా పామర్రు టౌన్ P – 4 కార్యాలయం (సచివాలయం–1) వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రగతి పథంలో పామర్రు – ప్రజల సమస్యల పరిష్కార వేదిక పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా అభ్యర్థనలు స్వీకరించి, పారదర్శకంగా పరిష్కారాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రజలు ఇచ్చిన బ్రహ్మాండమైన మెజారిటీ మాండేట్‌ను గౌరవంగా స్వీకరించి, ఆ విశ్వాసానికి తగ్గట్లుగా బాధ్యతాయుత పరిపాలన అందించడం తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ప్రజా దర్బార్‌లో మొత్తం 25 సమస్యలు నమోదు కాగా, వాటిలో 8 సమస్యలకు అక్కడికక్కడే తక్షణ పరిష్కారాలు అందించారు. మిగతా ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు.

