Prabhas – Bunny | ప్రభాస్ కి వర్కవుట్ అయ్యంది. మరి.. బన్నీకి..?

Prabhas – Bunny | ప్రభాస్ కి వర్కవుట్ అయ్యంది. మరి.. బన్నీకి..?

Prabhas – Bunny | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒకప్పుడు స్టార్ హీరోలు సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ అయితే.. ఒక సంవత్సరంలో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ (Release) చేశారు. తెలుగులో మరే హీరో కూడా సంవత్సరంలో ఇన్ని సినిమాలు రిలీజ్ చేయలేదు. అయితే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ బాటలో.. బన్నీ కూడా వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. మరి.. ప్రభాస్ కి వర్కవుట్ అయినట్టే బన్నీకి కూడా వర్కవుట్ అయ్యేనా…?

Prabhas - Bunny

ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉంటే.. మరో రెండు, మూడు సినిమాలు ఓకే చేసి ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు రెడీగా ఉంటాడు. మరో రెండు మూడు సినిమాలు డిస్కసన్ స్టేజ్ లో ఉంటాయి. ఇలా.. ఖాళీ అనేది లేకుండా వరుసగా సినిమాలు (Movies) చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు ప్రభాస్. ఏ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు ఏ సినిమాకి డేట్స్ ఇవ్వాలో కూడా కన్ ఫ్యూజ్ అయ్యే పరిస్థితి. అంతలా బిజీగా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ఇలా ఎక్కువ సినిమాలు చేస్తూ ఎంతో మందికి పని కల్పిస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్.

Prabhas - Bunny

అయితే.. ఇప్పుడు ప్రభాస్ బాటలో బన్నీ కూడా వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ (Director) అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా కూడా ఈ ఇయర్ లోనే సెట్స్ పైకి వస్తుందని ప్రకటించారు. ఈ రెండు సినిమాలతో పాటు పుష్ప 3 కూడా ఉంది. దీనికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుందట. ఈ మూవీ కోసం కొత్తగా ఆఫీస్ తీసారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో బన్నీ సినిమా కూడా ఉందని నిర్మాత టీ సిరీస్ భూషణ్ కుమార్ ప్రకటించారు. ప్రభాస్ వలే.. రెండు మూడు ప్రాజెక్టులు అనౌన్స్ చేసి ఆతర్వాత డేట్స్ ఇస్తున్నాడు ఐకాన్ స్టార్. మరి.. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళుతున్నాడు.. బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్ గా వరుసగా సక్సెస్ సాధించి దూసుకెళతాడేమో చూడాలి.

Prabhas - Bunny

CLICK HERE TO READ దృశ్యం 3 ఉన్నట్టా..? లేనట్టా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply