Prabhas | బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న రాజాసాబ్..

Prabhas | బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న రాజాసాబ్..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్(Latest movie The Rajasaab). మారుతి తెరకెక్కించిన ఈ క్రేజీ హర్రర్ మూవీ సంక్రాంతికి జనవరి 9న థియేటర్స్ లోకి వస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే.. తమిళనాడులో ఈ సినిమాకి థియేటర్స్ దొరకని పరిస్థితి. ఇప్పుడు ఈ మూవీకి జాక్ పాట్ అని టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ఏంటి..?

Prabhas | జన నాయగన్ కు అడ్డంకులు..

Prabhas

రాజాసాబ్ మూవీ భారీ పోటీ మధ్య రిలీజ్ అవుతుంది. తెలుగులో మ‌రో నాలుగు సినిమాలు బ‌రిలో ఉన్నాయి. త‌మిళ్ లో విజయ్ జ‌న‌ నాయ‌గన్ సినిమా వస్తుంది. అందువలన తమిళ్ లో రాజాసాబ్ కు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. జన నాయగన్ కి తెలుగులో కూడా భారీగా స్క్రీన్స్ ఇచ్చారు.

Prabhas

మ‌రో వైపు త‌మిళ‌నాడు స‌హా ద‌క్షిణాదిన మిగ‌తా అన్ని రాష్ట్రాల్లోనూ జ‌న‌నాయగ‌న్ భారీగా రిలీజ్ ప్లాన్ చేయడంతో ప్ర‌భాస్ సినిమాకు కొంత మేరకు ఇబ్బందిగా మారింది. ఓవ‌ర్సీస్‌లో కూడా ఇదే ప‌రిస్థితి ఏర్పడింది. అయితే.. ఇప్పుడు విజ‌య్ జన నాయగన్ కు సెన్సారు నుంచి అనుకోని అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది.. కోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. దీంతో జన నాయగన్ పోస్ట్ పోన్ అయ్యింది.

Prabhas | రాజాసాబ్ సోలో రిలీజ్..

Prabhas

జన నాయగన్ పోస్ట్ పోన్ అవ్వడంతో.. రాజాసాబ్ కు సోలో రిలీజ్ దొక్కింది. ఇది జాక్ పాటే అని చెప్పచ్చు. తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌నాయ‌గ‌న్ కోసం కేటాయించిన స్క్రీన్స్ ప్రభాస్ మూవీకే దక్కుతాయి. అంతే కాకుండా.. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌లో కూడా రాజాసాబ్‌కు పోటీనే ఉండ‌దు. కావాల్సిన‌న్ని స్క్రీన్లు ఇస్తారు. నార్త్ లో కూడా వసూళ్లు ఎక్కువ రాబట్టడానికి అవకాశం ఉంటుంది.

Prabhas

ఇక ఓవ‌ర్సీస్‌లో అయితే.. రాజాసాబ్‌కు ఎదురే ఉండ‌దు. ఇలా జరగడంతో ముందు అనుకున్న ఓపెనింగ్స్ కంటే భారీగా ఓపెనింగ్స్ రావడం.. రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. పాజిటివ్ టాక్ వస్తే.. ఫస్ట వీక్ లోనే చాలా వరకు పెట్టుబడి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సంక్రాంతి ఫెస్టివల్.. దీనికి తోడు సోలో రిలీజ్.. నిజంగా రాజాసాబ్ కు జాక్ పాటే. మరి.. ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

CLICK HERE TO READ ప్రమోషన్స్ కు దూరం..?

CLICK HERE TO READ MORE

Leave a Reply