పీపీపీ విధానం బెస్ట్

  • మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం బ్యూరో, అక్టోబర్ 9 (ఆంధ్రప్రభ) : మెడికల్ కళాశాలలో పీపీపీ విధానంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శించారు. అనంతపురంలో జీఎస్టీ అమలు విధానం గురించి నగరంలోని పలు మెడికల్ స్టోర్ లను సందర్శించి అవగాహన కల్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జీఎస్టీని పలు అంశాలపై తగ్గింపు చేసి వినియోగదారులకు భారీగా ఊరట కల్పించే దిశలో అమలు చేసిన నేపథ్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ (Super GST Super Savings) అనే కార్యక్రమం పేరుతో నెల పాటు ఒక బృహత్తర కార్యక్రమం రాష్ట్రంలో చేపట్టి వివిధ వర్గాల ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు.

రాష్ట్రంలో పలు ప్రజోపయోగ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు (Development programs) అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ ప్రభుత్వం తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమన్నారు. మెడికల్ కాలేజీల అంశం (ppp) మోడల్.. జగన్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ప్రజలకు ఏది అవసరమో, ఏది సమంజసమో వాటిని అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తోంది. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడన్నారు.

ప్రజలకు సేవ చేసే ఒక కూలీలా పని చేస్తున్న నిజమైన నాయకుడు మన ముఖ్యమంత్రి అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి రోజూ ప్రజలకు ఎంతో మేలు చేసే ఏదో ఒక కార్యక్రమం చేస్తోందన్నారు. విశాఖ ఉక్కు (Visakha Steel) పరిశ్రమ కాపాకోవడం, విశాఖ రైల్వే జోన్, జీఎస్టీ తగ్గింపు వంటి పలు కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చొరవ వలన జరుగుతున్నాయి. ఆర్డీటీ జిల్లాలో ఒక ఎన్జీఓ. ఎఫ్.సి.ఆర్.ఐ రెన్యూవల్ కోసం సీఎం రెండు సార్లు చర్చించారు. వ్యక్తిగతంగా టేకప్ చేశారు. మొన్న జరిగిన సమావేశంలో హోంమంత్రి తో మాట్లాడారు. తొందరలోనే ఒక పాజిటివ్ వార్త వస్తుందన్నారు.

Leave a Reply