శ్రీ‌రామ్‌సాగ‌ర్ జ‌ల‌విద్యుత్ రికార్డు

శ్రీ‌రామ్‌సాగ‌ర్ జ‌ల‌విద్యుత్ రికార్డు

. 67 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి
. ఇప్పటివరకూ 67.42 మిలియన్ యూనిట్లు పూర్తి
. ఐదు నెల‌ల ముందే టార్గెట్ పూర్తి

బాల్కొండ,(నిజామాబాద్ జిల్లా) ఆంధ్రప్రభ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project) జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుత ఆర్థిక (2025 -26) సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ముంద‌స్తుగా పూర్తయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 67 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం జల విద్యుత్ సౌదా నిర్ణయించింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లోకి గత 100 రోజుల నుండి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో స్థానిక జల విద్యుత్ కేంద్రం(Hydropower Station)లో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలల ముందు గానే లక్ష్యానికి విద్యుత్ ఉత్పత్తి చేరుకుంది. దీంతో జలవిద్యుత్ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా, ఎస్కేప్ గేట్ల(Escape Gates) ద్వారా నిరంతరం నీటి విడుదల కొనసాగుతుండడంతో నాలుగు టార్ బైన్ ల ద్వారా 36.61 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రబీలో కూడా కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల చేపట్టే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో మరింత విద్యుత్ ఉత్పత్తి(Power Generation) చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 67.42 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని జెన్ కో డిఈ శ్రీనివాస్ తెలిపారు.
ప‌దేళ్లుగా ప‌రిశీలిస్తే…
2021-22 లో 109.76 మిలియన్ యూనిట్లు
2022-23 లో 138.92 మిలియన్ యూనిట్లు
2023-24 లో 75.86 మిలియన్ యూనిట్లు
2024-25 లో 66.73 మిలియన్ యూనిట్లు
2025-26 (1-11-2025) వరకు 67.42 మిలియన్ యూనిట్లు

Leave a Reply