పేదరికం జయించింది..

తల్లిదండ్రుల ఆశలను నిజం చేసిన రోజా…

నర్సంపేట, ఆంధ్ర ప్రభ : పేదరికం జయించి తల్లిదండ్రుల కలను నిజం చేసి లాయరుగా(As a lawyer) నూతన అధ్యాయానికి పుస్తకం తెరిసిన రోజా. నర్సంపేట పట్టణంలోని వల్లబ్ నగర్‌(Vallabh Nagar)కు చెందిన రోజా దళిత పేద కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టడంతో పాటు పేద ప్రజలకు తన సహకారాన్ని అందిస్తానని రోజా(Roja) తెలిపారు.

యాకయ్య, సాంబలక్ష్మిల కూతురైన రోజా లా కోర్సు పూర్తి చేసి పట్టా అందుతుంది. నర్సంపేట మున్సిఫ్ కోర్ట్‌(Munsif Court)లో న్యాయవాద వృత్తిని చేపడుతున్నట్లు ప్రకటించారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పేదరికం జయించి ఉన్నత చదువులు చదివి పేదలకు సహకారం అందిస్తానని ప్రకటించిన రోజాను స్థానిక కోర్టులోని న్యాయవాదులు, కాలనీకి చెందిన పలువురు అభినందించారు.

Leave a Reply