విజయవంతంగా 100 రోజులు 100 గ్రామాలు

విజయవంతంగా 100 రోజులు 100 గ్రామాలు

వంద రోజులు 100గ్రామాలు 50వ రోజు పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న ప్రజల వద్దకు ప్రవీణ్, 100 రోజులు – 100 గ్రామాలు కార్యక్రమం లో 50వ రోజు పోస్టర్ ను బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.


పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంవిజయవంతంగా కొనసాగుతోంది.


ఈ కార్యక్రమంలో భాగంగా 50వ రోజు పోస్టర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇప్పటి వరకు నిర్వహించిన 49 రోజుల కార్యక్రమ వివరాలను ముఖ్యమంత్రి కి వివరించారు. నియోజకవర్గంలోని గ్రామాలన్నింటిని సందర్శిస్తూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించడం, తక్షణ పరిష్కారంఅవసరమైన అంశాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.


ఇప్పటివరకునిర్వహించిన పర్యటనల్లో గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


ఈ కార్యక్రమాన్ని ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ప్రజాప్రతినిధుల బాధ్యతఅనిపేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు మరింత దగ్గర చేస్తాయని అభినందించారు.


పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజలకుఅందుబాటులో ఉండే విధంగా ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు, 100 గ్రామాలు కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు..

Leave a Reply