Poster | పోస్టర్ ఆవిష్కరణ

Poster | నరసరావుపేట, ఆంధ్రప్రభ : స్థానిక ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో 11వ తేదీన పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్ధులకు రాష్ట్రస్థాయిలో “ఈశ్వర్ పాలి ఫ్యూషన్ ఫెస్ట్ -2025” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక , సాంస్కృతిక, ఆటలు మొదలైన అంశాలపై పోటీ నిర్వహిస్తున్న సందర్భంగా “ఈశ్వర్ పాలి ఫ్యూషన్ ఫెస్ట్ -2025” సంబంధించిన పోస్టర్ ను ఈశ్వర్ కళాశాల(Ishwar College) యాజమాన్యం ఆదివారం ఆవిష్కరించింది. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో కరస్పాండెంట్ షేక్.కరీం మోహిద్దీన్, మేనేజింగ్ డైరెక్టర్ డా.షేక్.మస్తాన్ షరీఫ్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షేక్ నజీమా, ప్రిన్సిపాల్ డా జి. నాగమల్లేశ్వర రావు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

Leave a Reply