Polling | పల్లెల్లో జోరందుకున్న ప్రచారాలు

Polling | పల్లెల్లో జోరందుకున్న ప్రచారాలు

Polling | చెన్నూర్, ఆంధ్రప్రభ : మరో నాలుగు రోజుల్లో జరుగనున్న మూడో విడత ఎన్నికల పోలింగ్ అయిన చెన్నూరు నియోజకవర్గంలోని పల్లెల్లో అభ్యర్థుల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. పార్టీల మద్దతు అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం తమదైన శైలిలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరుగుతూ ప్రచారాలు సాగిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు తమ తమ గ్రామాల్లో విందులు, నజరానాలు అందిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. చెన్నూరు మండలంలోని 30గ్రామ పంచాయతీలకు గాను ఒకటి ఏకగ్రీవం కాగా, 29పంచాయతీలకు ఎన్నిక జరుగనుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షపార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి తిరుగుబాటు అభ్యర్థుల బెంగ వెంటాడుతుంది.

Leave a Reply