Polling | చెన్నూరులో 70.2శాతం పోలింగ్..

Polling | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ లో మధ్యాహ్నం 3గంటల వరకు 70.2శాతం ఓటింగ్ నమోదు అయినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఉదయం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని లైన్లు కట్టారు. స్థానిక నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రజలు ఓటు వేయడానికి ఉత్సాహతో కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. కొత్త ఓటరులు, దూరప్రాంతాల్లో నివాసం ఉన్న ఓటర్లు సమయానికి ఓటు వేయడానికి స్వంత వాహనాల ద్వారా పట్టణానికి చేరుకొని ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటున్నారు.
