POLIO | మహమ్మారి..

POLIO | మహమ్మారి..

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పోలియో మహమ్మారి మరోసారి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందని.. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం అవనిగడ్డలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు పల్స్ పోలియో శిబిరాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరుగు దేశాల్లో పోలియో కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రయాణికుల ద్వారా ఈ వ్యాధి మళ్లీ ప్రబలకుండా ప్రభుత్వం పల్స్ పోలియో చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply