Poling Station | ర్యాండమైజేషన్ పూర్తి

Poling Station | ర్యాండమైజేషన్ పూర్తి

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

Poling Station | ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. ఇవాళ‌ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో మూడవ విడతలో ఎన్నికలు జరుగనున్న కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల పోలింగ్ సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ సమక్షంలో నిర్వహించారు.

ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు. ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ తో సమీక్షించారు. గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికలు నిర్వహించే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు.

Leave a Reply