Police | పంచాయతీ ఎన్నికలకు, పోలీసులకు సహకరించాలి…

Police | పంచాయతీ ఎన్నికలకు, పోలీసులకు సహకరించాలి…

Police | ధర్మపురి, ఆంధ్ర‌ప్ర‌భ : ధ‌ర్మ‌పురి మండల గ్రామ పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ధర్మపురి ఎస్ఐ మహేష్ కోరారు. మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో మండలంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

పోలింగ్(Polling) నిర్వహించబడే గ్రామాలలో ఎన్నికల రోజు 163 బిఏన్ఎస్ ( 144 Cr.P.C) చట్టం అమలులో ఉంటుందని అభ్యర్థులు గాని, ప్రజలు గాని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా వ్యవహరించాలని, పోలీస్ శాఖ(Police Department)కు పూర్తి సహకారం అందించాలని కోరారు.

ఎవరైనా చట్ట విరుద్ధమైన లేదా సాంఘిక శాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడి, పోలీస్ విధులకు లేదా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించినట్లయితే, సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ మహేష్ హెచ్చరించారు.

Leave a Reply