పోలీసుల వందేమాతరం గీతాలాపన

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ.రమణ మార్గదర్శకత్వంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వందేమాతరం దేశభక్తి గీతాన్ని ఆలపించారు. ఈ గీతం దేశభక్తికి, త్యాగస్ఫూర్తికి గుర్తుగా నిలుస్తుందన్నారు.

అదనపు ఎస్పీ మాట్లాడుతూ, వందేమాతరం గీతం స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలకు ప్రేరణగా నిలిచిందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఏవో గోపినాథ్, సీఐ శ్రీనివాస్, ఆర్ఐ శంకర్ ప్రసాద్, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply