Police security | భారీ పోలీసు బలగాలు మధ్య ముగిసిన పోలింగ్

Police security | భారీ పోలీసు బలగాలు మధ్య ముగిసిన పోలింగ్

  • ఎన్నికల సరళిని పరిశీలించిన శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్

Police security | కొత్తూరు, ఆంధ్రప్రభ : కొత్తూరు మండలంలో మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొత్తూరు ఇన్స్పెక్టర్ జి.నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ బందోబస్తు(Police security) మధ్య ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా కొత్తూరు మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రం ఇన్ముల్ నర్వను శంషాబాద్ జోన్ డీసీపీ ఎం.రాజేష్, సీటీసీ ఏసిపి గంగరాం పరిశీలించారు.

ఈ సందర్భంగా డీసీపీ రాజేష్(DCP Rajesh) మాట్లాడుతూ.. ఎన్నికలు, ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద జనాలు గుమికూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు ఇన్స్పెక్టర్ జి.నర్సయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply