Mahbubabad | నీట్ పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు

మహబూబాబాద్, మే 4 (ఆంధ్రప్రభ) : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నీట్ పరీక్ష కేంద్రాలు వివిధ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయగా, అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో అధికారులు నీట్ పరీక్షల కోసం ఏర్పాట్లు చేశారు. 513 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మహబూబాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి తిరుపతిరావు ఆధ్వర్యంలో రూరల్ సీఐ సర్వయ్య, పట్టణ సీఐ దేవేందర్, పోలీస్ సిబ్బంది, బందోబస్తు చేపట్టారు.

Leave a Reply