బాసర, జులై 11 (ఆంధ్రప్రభ) : గోదావరి నది (Godavari River) లో ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నించిన యువకుడిని శుక్రవారం పోలీసులు ( police) కాపాడారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా (Nanded District) బోకర్ తాలూకా షాపూర్ గ్రామానికి చెందిన నాందేవ్ దేవిదాస్ (Nandev Devidas) ఇంట్లో గొడవల కారణంగా గోదావరి నదిలో దూకేందుకు రెండవ ఘాట్ వద్ద అనుమానాస్పదంగా ఉండడంతో గమనించిన స్పెషల్ పార్టీ పోలీసులు కానిస్టేబుల్ మోహన్ సింగ్ యువకుని నచ్చజెప్పి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఎస్ఐ శ్రీనివాస్ కౌన్సెలింగ్ నిర్వహించారు. చిన్నపాటి గొడవల కారణంగా ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని, కుటుంబంలోని పెద్దల సమక్షంలో మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. యువకుడిని కాపాడిన పోలీసులను సీఐ మల్లేష్,ఎస్ ఐ అభినందించారు.