తూడుకుర్తిలో పోలీసులు ర్యాలీ

  • భారీ బందోబస్తు ఏర్పాటు

నాగర్, కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి, శ్రీపురం గ్రామాలలో జిల్లా అదిషనల్ పోలీస్ ఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేసి, పోలీసులతో ఫ్లాగ్ మార్చ్, భారీ ర్యాలీ, కవాతు నిర్వహించారు.

రెండో విడత పోలింగ్ ఆదివారం జరగనున్న నేపథ్యంలో, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్రమంగా చర్యలు తీసుకోవాలని అదిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రెండు గ్రామాల్లోని ప్రధాన రహదారులలో పోలీసులు కవాతు నిర్వహించారు.

నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు కల్వకుర్తి డీఎస్పీ, సిఐడి తోపాటు ముగ్గురు సిఐలు, ముగ్గురు ఎస్సైలు, రెండు బెటాలియన్ ప్లాటూన్లు పాల్గొని పోలీసుల కవాతు నిర్వహించారు.

ఈ గ్రామం ఎంఎల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి స్వగ్రామం కావడం విశేషం. కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య పోటాపోటీగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, భద్రతను కాపాడడానికి ఈ బందోబస్తు ఏర్పాటు చేయబడినట్లు సమాచారం.

Leave a Reply