మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
- ఒకటో వార్డులో పోలీస్ అవగాహన సదస్సు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఒకటో వార్డు కాంగ్రెస్ నాయకుడు కసిని విక్రాంత్ అన్నారు. సంగారెడ్డి మున్సిపల్ ఒకటో వార్డ్ లో సోమవారం నిర్వహించిన పోలీస్ అవగాహన సదస్సులో కసిని విక్రాంత్ మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. మైనర్లు వాహనాలు నడపవద్దని, ఇది చట్ట విరుద్ధమే కాకుండా ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరించారు. అ
లాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం కలగడమే కాకుండా కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని తెలిపారు. దూద్ బాయీ చెరువు కట్టపై రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో రాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్‌ను మరింతగా పెంచాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ, సమాజ శాంతి భద్రతల కోసం పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
