Police Acts | పోలీస్ చట్టాలపై అవగాహన

Police Acts | పోలీస్ చట్టాలపై అవగాహన

Police Acts | కుంటాల, ఆంధ్రప్రభ : దౌనెల్లి, దౌనెల్లి తాండతో పాటు అనుబంధ గ్రామాల్లో ఆయన ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ చట్టాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ పోలీస్ చట్టాల(Police Acts)ను గౌరవించాలని, పోలీస్ చట్టాలకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట‌పరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అదే విధంగా మహారాష్ట్ర ప్రాంతానికి దగ్గర ఉన్న గ్రామంలో దేశి దార్ అక్రమ మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు.

Police Acts |

కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీడియో కాల్ చేసి పోలీసులు, తమ వ్యక్తులను కిడ్నాప్ చేశామని వీడియో కాల్ చేసి బెదిరింపులకు పాల్పడతారని, అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు మోసపోకూడదని అన్నారు. ఏదైనా జరుగుతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని క్షణంలో మీ ముందుకు వ‌స్తామ‌ని ఆయన తెలిపారు. పోలీస్ చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెట్టు రాజు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply