POLICE | నిబంధనలు ఉల్లంఘిస్తే..
POLICE | పరకాల, ఆంధ్రప్రభ : ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలని, నిబంధన ఉల్లంగఘిస్తే చర్యలు తప్పవు అని పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ వి క్రాంతి కుమార్ వెల్లడించారు. పరకాల మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 14వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఊరేగింపులకు, గెలుపొందిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఊరేగింపులకు అనుమతి లేదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గెలుపొందిన అభ్యర్థులందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పరకాల మండలంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలకు, అన్ని రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని తెలియజేశారు.

