police |ప్రజల భద్రతే లక్ష్యం.

police |ప్రజల భద్రతే లక్ష్యం.

కర్నూల్ జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్…
సాంకేతికతతో నేరాల కట్టడి.
డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణ.
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

police | కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళ వారం తెలిపారు. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ (డిజిపి ఆఫీసు ) నుండి జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన 3 నూతన డ్రోన్ కెమెరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. డే విజన్, నైట్ విజన్ డ్రోన్ కెమెరాల ద్వారా పగలు, రాత్రి నిరంతర నిఘా ఉంటుందన్నారు. జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలోని కాలేజ్ లు, స్కూల్స్ వద్ద డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచి ఆకతాయిలను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

శక్తి టీమ్ బృందాలతో కళాశాలలు, పాఠశాలల వద్ధ ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారిని గుర్తించుటకు, బహిరంగ మద్యపానం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ డ్రోన్ల వినియోగం ఎంతో కీలకంగా మారుతుందన్నారు. డ్రోన్ల ద్వారా నేరాలు అరికట్టడం , చోరీల నివారణ, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన పర్యవేక్షణ సాధ్యమవుతుందన్నారు. సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాల్లో ఈ డ్రోన్ల తో నిఘా ను పటిష్టంగా పని చేయడానికి వీలుంటదన్నారు. ఉత్సవాలు, పండుగలు, వేడుకలు, ట్రాఫిక్ నియంత్రణకు, భారీగా ప్రజలు తరలివచ్చే సందర్భాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ సాంకేతికత మరింత దోహదపడుతుందన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా, స్మార్ట్ పోలీసింగ్ దిశగా జిల్లా పోలీసు శాఖ ముందడుగు వేస్తోందన్నారు. సీసీ కెమెరాల వినియోగంతో పాటు డ్రోన్ టెక్నాలజీని సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాలో ప్రశాంత వాతావరణo కొనసాగే విధంగా గట్టి చర్యలు చేపడతామని కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసుధన్ రావు, సైబర్ ల్యాబ్ సిఐ మస్తాన్ వలి, ఆర్ ఐ నారాయణ, సైబర్ ల్యాబ్ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply