POLICE | కారులో మంటలు..
POLICE | గన్నవరం, ఆంధ్రప్రభ : హనుమాన్ నుండి విజయవాడ వెళ్ళే జాతీయ రహదారిలో వీరవల్లీ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై కారులో (Car) శనివారం మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు బయటకు వచ్చేశారు. స్థానికంగా ఉన్నవారు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకుని మంటలు ఆర్పినప్పటికీ.. కారులో చాలా భాగం కాలిపోయింది.


