Police | ట్రాఫిక్ నియమాలు పాటించి గమ్యం చేరుకొండి

Police | ట్రాఫిక్ నియమాలు పాటించి గమ్యం చేరుకొండి
- గణపురం ఎస్ఐ రేఖ అశోక్
Police | గణపురం, ఆంధ్రప్రభ : మేడారం జాతరకు వెళ్లే భక్తులు ట్రాఫిక్ నియమాలను పాటించి దేవతామూర్తుల దర్శనం చేసుకుని గమ్యానికి చేరుకోవాలని జయశంకర్ జిల్లా గణపురం ఎస్సై రేఖ అశోక్ అన్నారు. మండల పరిధిలో వివిధ గ్రామాల నుంచి మేడారం వెళ్ళే భక్తులకు పలు సూచనలను చేశారు. వాహనాలలో వెళ్తున్న వాహనదారులు మద్యం సేవించకుండా, అతివేగం లేకుండా తగు జాగ్రత్తలను పాటించి తమ తమ స్థానాలకు చేరుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించి డ్రైవింగ్ చేయాలన్నారు. ప్రధాన రహదారి వెంబడి పలుకూడళ్ల వద్ద పోలీసు బలగాలను అందుబాటులో ఉంచామని ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని భక్తులు, ప్రజలంతా సహకరించాలని వారు కోరారు.
