Police | బాధ్యతలు స్వీకరించిన సీఐ

Police | బాధ్యతలు స్వీకరించిన సీఐ

Police | బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రూరల్ సీఐగా గడ్డం జాన్ రెడ్డి శనివారం బాల్కొండ మండల కేంద్రంలోని రూరల్ సీఐ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ సీఐగా విధులు నిర్వహించిన శ్రీధర్ రెడ్డిని ఉన్నతాధికారులు ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. కరీంనగర్ లోని త్రీ టౌన్ లో విధులు నిర్వహించి ఆర్మూర్ రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. బదిలీపై వెళ్లిన శ్రీధర్ రెడ్డి సిబ్బంది పూలమాలతో ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్లిన నూతన సీఐకి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా సిబ్బందిని పరిచయం చేసుకున్నారు.

Leave a Reply