పోక్సో కేసు నమోదు.. అరెస్టు
మోత్కూర్, ఆంధ్రప్రభ : వరుసకు చెల్లి అని కూడా చూడకుండా ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ యువకుడిపై పోక్సో కేసు(POCSO case) నమోదైంది. మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో సొంత చిన్నమ్మ కుమార్తె (వరుసకు చెల్లెలు) మైనర్ బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడిన గాంధీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి (27)పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐ సి.వెంకటేశ్వర్లు(CI C. Venkateswarlu) తెలిపారు.
ఆ యువకుడు ఓ చికెన్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. గత ఏడాది కాలంగా చిన్నమ్మ కుమార్తెను లైంగిక వేధింపులకు గురిచేస్తుండడంతో ఆ బాలిక తల్లికి సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె తల్లి స్థానిక పోలీసు స్టేషన్(Police Station)లో ఫిర్యాదు చేయగా బాలిక ను వైద్య పరీక్షల కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి పంపించినట్లు తెలిపారు. ఆ యువకుడిని ఈ రోజు అరెస్టు చేశామని, చౌటుప్పల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. నల్గొండ జైలుకి తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

