PMSRI 2 :  క్రికెట్ ​ పిచ్​ అదృశ్యం

    PMSRI 2 :  క్రికెట్ ​ పిచ్​ అదృశ్యం

క్యాష్​ వోచరే  సాక్ష్యం

  పీఎంశ్రీ  మనీ ఆవిరి

​ పెవిలియన్​ లోనే టీమ్​ ఢకౌట్​

–ఇదొక  కిలాడీ పెద్దల  గారడీ

అర్థవీడు వెళ్తే తెలుస్తుంది నిజం

( అర్ధవీడు, ఆంధ్రప్రభ) 

 సార్.. సార్.. మహాలక్షి కిడ్నాప్ అయింది. అదే సార్! మహాలక్ష్మి పేరు గల చేపల చెరువు కిడ్నాప్ అయింది అంటూ పోలీస్ కంప్లయింటు ఇస్తున్న దృశ్యం రాజా వారి చేపల చెరువు చిత్రంలో కనిపిస్తుంది. ఇది సగటు ప్రేక్షకుడికి హాస్య కల్పనే కావచ్చు.

కానీ, అచ్చం ఇలాగే అర్థవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ( జి హెచ్ ఎస్ ) క్రికెట్ పిచ్ కిడ్నాప్ అయింది. ఇది ఎంత మాత్రమూ హాస్యం కాదు. కల్పనా అంతకన్నా కాదు. అందుకే  సినిమాలో లాగా పోలీసుకు కంప్లయింటు చేయలేదు. పీఎంశ్రీ ఆర్థిక రికార్డు, అక్కడి ఆట స్థల స్వరూపం ఆధారంగా పబ్లిక్ కి అందిస్తున్న రియాలిటీ రిపోర్ట్ ఇది.

PMSRI 2 :  క్రికెట్ ​ పిచ్​ అదృశ్యం

అర్థవీడు జీహెచ్ఎస్ కు విశాల ఆట స్థలం ఉంది. ఇందులో క్రికెట్ పిచ్ నిర్మించారట. ఇందుకోసం చేసిన వ్యయాన్ని రూ. 27,400 నగదు చెల్లించారట.ఈ విషయాన్ని పీ ఎం శ్రీ ( ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) నగదు చెల్లింపుల వోచర్ నంబర్ – 10 లో ససాక్ష్యంగా రాశారు. కానీ, ఆట స్థలంలో భూతద్దం వేసి ఆణువణువు  వెదికినా క్రికెట్ పిచ్ కనిపించడం లేదు.

PMSRI 2 :  క్రికెట్ ​ పిచ్​ అదృశ్యం

కనీసం దాని ఆనవాళ్ళైనా కాన రావడం లేదు. ఏమై ఉంటుంది? ఎక్కడికైనా వెళ్లిందా అంటే పిచ్ కి కాళ్ళుండవు కదా! పోనీ మాయమైందా? అంటే అది మాయల ఫకీర్ కాదే! దాక్కుందా? అంటే తప్పుడు లెక్కలు రాసే తలపండితుడు అసలే కాదే! విజ్ఞతను మరచిన విధ్వంసుడు అంతకన్నా కాదు. సరే! చంపబడిందా! అంటే తన పిల్లలను తానే చంపుకు తినే విష సర్పం లాంటి జీవీ కాదు.  బహుశా! ఆ సినిమాలో చేపల చెరువులా ఈ క్రీడా మైదానంలో కూడా క్రికెట్ పిచ్  కిడ్నాప్ అయిందేమో! 

PMSRI 2 : : ఆడకుండానే ఢకౌట్​

కనిపించనిది క్రికెట్ పిచ్చే కదా..ఖర్చు చూపింది రూ. 27 వేలే కదా! ఏనుగులను కాదని చీమల కథలేంటి అనే చర్చ వినిపిస్తోంది. అవినీతి చిన్నదా, పెద్దదా కాదు సమస్య. పేద విద్యార్థులు వారి భవిష్యతు, భవిష్య భారత్ నిర్మాణం ఎలా అన్నదే ప్రశ్న.

PMSRI 2 :  క్రికెట్ ​ పిచ్​ అదృశ్యం

దీనికి సమాధానమే సమ్మిళిత విద్యా బోధన, అభ్యాసనం అనే నూతన విద్యా విధాన లక్ష్యం. దీని సాధన కోసం ప్రాంతీయంగా మోడల్ గా చూపేందుకు పీ ఎం శ్రీ పథకం అర్థవీడు జి హెచ్ ఎస్ ను ఎంపిక చేసింది. ఒక విధంగా ఈ పాఠశాలను ప్రధాన మంత్రి దత్తత తీసుకున్నట్లు. ఇలాంటి ప్రాధాన్యత నేపథ్యంలోనే ఈ పాఠశాలకు క్రీడా ప్రాంగణాల అభివృద్ధి కి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఇక్కడ సర్కారి విద్యార్థులకు ఆట నేర్పేందుకు, వారు ఆడుకునేందుకు, వారిలో పోటీ తత్వాన్ని నింపేందుకు, జట్టు పనిని అలవర్చేందుకు, గెలుపు ఓటముల కారణంగా జనించే  భావొద్వేగాలను స్వీయ నియంత్రణలో ఉంచుకునేలా బాల్యంలోనే తర్ఫీదు ఇచ్చేందుకు ఉద్దేశించినవి ఈ క్రీడా ప్రాంగణాలు.

PMSRI 2 :  క్రికెట్ ​ పిచ్​ అదృశ్యం

తద్వారా చిన్నారుల్లో మూర్తిమత్వాన్ని గణనీయ స్థాయికి తీసుకెళ్ళాలనేది వ్యూహం. ఇంతటి లోతైన, జవాబుదారి ఆలోచనకు గండి పడితే చిన్నదైనా, పెద్దదైనా జరిగే నష్టం పూడ్చలేనిది. అయినా గండి పడింది. కనీసం తమ మైదానంలో క్రికెట్ పిచ్ ఉందని తెలియక ముందే సర్కారీ విద్యార్థులను డక్కౌట్ చేసేశారు. ఇది తన పిల్లలను తానే చంపుకు తినే విష సర్ప లక్షణాల వారికే సాధ్యమవుతోంది.

ALSO READ : PMSRI  Scam :   భళా.. అర్థ క్రీడ  Andhra Prabha SPL Story)

ALSO READ : Blind Champions :  అందరూ  అంధులే

Leave a Reply