• వందే భారత్ రైళ్లు, మెట్రో ప్రాజెక్టులు ప్రారంభం

ప్రధాని మోదీ రేపు (ఆగస్టు 10న‌) బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. మొత్తం నాలుగు గంటల పాటు మోదీ నగరంలో ఉండనున్నారు.

ఉదయం 10:30 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత, హెలికాప్టర్ లేదా రోడ్డు మార్గం ద్వారా కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆయన మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

  • కేఎస్ఆర్ బెంగళూరు–బెళగావి
  • అమృతసర్–శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా
  • అజ్ని (నాగ్‌పూర్)–పుణే ‘నమ్మ మెట్రో’ మూడో దశకు శంకుస్థాపన

ఆ త‌రువాత మోదీ రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌కు చేరుకుని, ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు రాగిగుడ్డ–ఎలక్ట్రానిక్స్ సిటీ మార్గంలో మెట్రో ప్రయాణం చేయనున్నారు. మధ్యాహ్నం 12:50 గంటలకు ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్-1 సమీపంలో ఎల్లో లైన్ మెట్రో మార్గాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ‘నమ్మ మెట్రో’ మూడో దశ పనులకు కూడా శంకుస్థాపన జరపనున్నారు.

కార్యక్రమం అనంతరం మోదీ హెలికాప్టర్‌లో తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకుని, మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు.

ఈ పర్యటనలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నందున, నగరంలోని ప‌లు ప్రాంతాల్లో ఆదివారం ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు బెంగ‌ళూరు పోలీసులు. ప్రజలు ముందస్తుగా ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply